Tamannaah: చిరంజీవి సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. మాస్ ఆడియన్స్‌కు పండగే!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్‌నే చూసి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసివస్తే ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందుగా మారడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ 'తమన్నా భాటియా' మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారని సమాచారం. ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.
Details
ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
ఆమె చేసిన 'కావాలయ్య', 'డా డా డాస్' వంటి పాటలు సోషల్ మీడియాలో భారీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే ఎనర్జీతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్‌కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం భారీ సెట్‌ను నిర్మించిందని, దాన్ని గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ టచ్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని టాక్. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.