HBD Tamannaah : తమన్నా బర్త్‌డే.. ఫిట్‌నెస్, బ్రేక్‌ఫాస్ట్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీ బ్యూటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు. 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నప్పటికీ, ఆమె ఫిట్‌నెస్, టోన్డ్ బాడీ చూసి ఈ వయసు నమ్మడం కష్టమే. ఇప్పటికే అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన తమన్నా, తన లీన్ అండ్ హెల్తీ ఫిజిక్‌కు ప్రధాన కారణం బ్యాలెన్స్‌డ్, న్యూట్రిషియస్ డైట్‌నే అని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఫిట్‌గా ఉండేందుకు కారణమైన సింపుల్ అయినప్పటికీ శక్తివంతమైన బ్రేక్‌ఫాస్ట్ సీక్రెట్‌ను తాజాగా వెల్లడించింది. తమన్నా భాటియా ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఆమె ఫిట్ ఫిజిక్, ఎనర్జీతో నిండిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన రోజువారీ అల్పాహారంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటానని తెలిపింది.
Details
తమన్నా ఫిట్‌నెస్ సీక్రెట్
సెప్టెంబర్ 14న 'కర్లీ టేల్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన ఫిట్‌నెస్‌కు దోహదపడే బ్రేక్‌ఫాస్ట్ రొటీన్‌ను వివరించింది. తన బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ అల్పాహారం 'పోహా'ని తాను క్రమం తప్పకుండా తీసుకుంటానని తమన్నా వెల్లడించింది. ఫైబర్ అధికంగా ఉండే ఫ్లాట్ రైస్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇస్తుందని, రోజంతా శక్తివంతంగా ఉంచుతుందని, బరువు నియంత్రణకు సహాయపడుతుందని చెప్పింది.
Details
పోహా, మొలకల కాంబినేషన్
తన డైట్ గురించి మాట్లాడుతూ, "సాధారణంగా బంగాళాదుంపలతో మంచి పోహాను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటా. చాలా ఎక్కువ పదార్థాలు కలపకుండా ప్లెయిన్ పోహానే ఇష్టపడతా. నేను బరువు తగ్గాలనుకున్నప్పుడు, పోహాతో పాటు ఎక్కువగా మొలకలను (స్ప్రౌట్స్) చేర్చడం ప్రారంభించాను. పోహాను మొలకలతో బ్యాలెన్స్ చేస్తే, అది బరువు తగ్గడానికి నిజంగా చాలా ప్రభావవంతంగా మారుతుంది" అని తమన్నా తెలిపింది.
Details
గుండె ఆరోగ్యానికి మేలు
విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన మొలకలతో కూడిన పోహా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన, పోషకమైన ఆహార ఎంపికగా చెప్పొచ్చు. తమ డైట్ విషయంలో తమన్నా గతంలో కూడా పలు విషయాలు వెల్లడించింది. డెయిరీ, గ్లూటెన్ రెండింటినీ దూరంగా ఉంచుతున్నానని ఆమె పేర్కొంది.
Details
తమన్నా డైట్ సీక్రెట్స్
ఆహారం స్కిన్‌కేర్‌పై ఎంత ప్రభావం చూపుతుందో కూడా ఆమె నొక్కి చెప్పింది. ఆగస్టు 3న 'లల్లంతోప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "మంచి డైట్ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుందని నేను నమ్ముతున్నాను. చాలా మందికి ఫుడ్ సెన్సిటివిటీలు ఉంటాయి, కానీ అవి తమకు ఉన్నాయని వారికి తెలియదు. చాలా సంవత్సరాల పాటు నాకు గ్లూటెన్, డెయిరీ పట్ల అసహనం ఉందని కూడా నాకు తెలియదని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా వివిధ డైట్స్‌ను ప్రయత్నించాను. గ్లూటెన్‌ను మానేయడం వల్ల నా చర్మం చాలా మెరుగుపడింది. డెయిరీని తగ్గించడం కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. ఇది నా ప్రయాణంలో ఒక పెద్ద లెర్నింగ్ ప్రాసెస్" అని తమన్నా వివరించింది.