తదుపరి వార్తా కథనం

అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్
వ్రాసిన వారు
Sriram Pranateja
Jun 27, 2023
02:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
గతకొన్ని రోజులుగా తమన్నా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం, ఆమె నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లే.
పై రెండింట్లో తమన్నా బోల్డ్ గా కనిపించింది. అదీగాక విజయ్ వర్మతో బంధం గురించి పరోక్షంగా తమన్నా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అవన్నీ అలా ఉంచితే, తాజాగా తమన్నాను ఓ అభిమాని షాక్ కి గురి చేసాడు. ముంబై ఎయిర్ పోర్టులో తమన్నా కనిపించడంతోనే తన కాళ్ళమీద పడిపోయాడు.
అంతేకాదు, తన చేతిపైన తమన్నా ఫేస్ టాటూని మిల్కీ బ్యూటీకి చూపించాడు. అది చూడగానే తమన్నా ఎమోషనల్ అయిపోయింది. లవ్ యూ అంటూ అభిమానిని హగ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.