Page Loader
తమన్నాతో రిలేషన్ పై మొదటిసారిగా స్పందించిన విజయ్ వర్మ 
తమన్నాతో రిలేషన్ పై విజయ్ వర్మ మాటలు

తమన్నాతో రిలేషన్ పై మొదటిసారిగా స్పందించిన విజయ్ వర్మ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 15, 2023
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతకొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్ షిప్ లో ఉనారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన తమన్నా, విజయ్ వర్మ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతానికి అతనే నా హ్యాపీ ప్లేస్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, తమన్నా, విజయ్ వర్మల మధ్య రిలేషన్ ఉందని అభిమానులు ఫిక్స్ ఐపోయారు. అయితే తమన్నాతో రిలేషన్ షిప్ విషయమై విజయ్ వర్మను ప్రశ్నలు అడిగింది ఓ మీడియా సంస్థ. ఆ ప్రశ్నలకు స్పందిస్తూ, సరైన సమయం వచ్చిన ఆ విషయం గురించి మాట్లాడతానని చెప్పిన విజయ్ వర్మ, తన మనసంతా ఇప్పుడు ప్రేమతో నిండిపోయిందని తమ్మన్నాతో తన బంధం నిజమేనని చెప్పకనే చెప్పుకొచ్చాడు.

Details

లస్ట్ స్టోరీస్ 2 జంటగా తమన్నా, విజయ్ వర్మ 

అటు తమన్నా, ఇటు విజయ్ వర్మల మాటలు విన్నాక అభిమానులంతా పెళ్ళెప్పుడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు. మరి అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి. తమన్నా, విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29నుండి స్ట్రీమింగ్ అవనున్న ఈ సిరీస్ లో రొమాంటిక్ కపుల్ గా తమన్నా, విజయ్ వర్మ కనిపించనున్నారు. ఇకపోతే తమన్నా నటించిన జీ కర్దా సిరీస్ ఈరోజు నుండి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. ఇంకా, తమన్నా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.