Hero karthi: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: హీరో కార్తీ
ఈ వార్తాకథనం ఏంటి
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి. వైవిధ్యమైన సినిమాల ఎంపికే ఆయనను తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర చేసింది. 'సత్యం సుందరం' విజయంతో మంచి జోష్‌లో ఉన్న కార్తి.. ఇప్పుడు 'సర్దార్ 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తి, పీఎస్ మిత్రన్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం 'సర్దార్'కు ఇది సీక్వెల్. ఈ నెల 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో కార్తి విలేకర్లతో ముచ్చటించారు.
వివరాలు
అందుకే 'సర్దార్' మళ్లీ తిరిగొస్తున్నాడు..
''సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ చేయడం నా అలవాటు కాదు.
కానీ 'సర్దార్' విషయానికి వస్తే.. ఆ పాత్రను మరింత కొత్తగా చూపించడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని అనిపించింది.
ఈసారి తొలి భాగం కంటే మరింత శక్తిమంతమైన విలన్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆ కథ విన్న తర్వాత 'సర్దార్ 2' కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను.
మొదటి భాగంలోని నీళ్ల కాన్సెప్ట్ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపే మరో కాన్సెప్ట్ ఉంటుంది. ఈసారి యాక్షన్, స్పై అంశాలు మరో స్థాయిలో ఉంటాయి'' అని కార్తి తెలిపారు.
వివరాలు
అదే పెద్ద సవాల్‌గా అనిపించింది..
'సర్దార్'లో తండ్రీకొడుకుల పాత్రలు క్లైమాక్స్‌లో మాత్రమే కలుస్తాయి.
కానీ రెండో భాగంలో వాళ్లిద్దరూ సినిమా మొత్తం కలిసి ప్రయాణిస్తారు. అందుకోసం రోజుకు రెండు గెటప్‌లు మార్చి మార్చి షూటింగ్ చేయాల్సి వచ్చేది.
ఒకేసారి వృద్ధ సర్దార్ పాత్రతో పాటు ఆయన కొడుకు పాత్రలో నటించడం పెద్ద సవాల్‌గా అనిపించింది.
అంతేకాదు.. ఈ రెండు పాత్రలు చేసే యాక్షన్ సన్నివేశాల్లోనూ చాలా వైవిధ్యం ఉంటుంది.
వయసు పైబడిన సర్దార్ మామూలు కుర్రాళ్లలా ఫైట్ చేయడు. అతను ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. తన చుట్టూ ఉన్న ఏ వస్తువునైనా ఆయుధంగా మార్చుకుని పోరాడగలడు.
నటుడిగా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసాన్ని చూపించడం నాకు మంచి అనుభూతిని ఇచ్చింది'' అని చెప్పారు.
వివరాలు
దేశంలోనే తొలిసారిగా అలాంటి సెట్ వేశాం..
''మొదటి భాగంతో పోలిస్తే 'సర్దార్ 2' తెరకెక్కించడం చాలా కష్టంతో కూడుకున్న పని.
టామ్ క్రూజ్ సినిమాల తరహాలో ప్రారంభం నుంచి ముగింపు వరకు యాక్షన్‌తోనే సాగుతుంది.
అందుకే దాదాపు పది నెలల పాటు ఎంతో కష్టపడి చిత్రీకరించాం. ఈ సినిమాకు రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
దేశంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం ఒరిజినల్ సైజ్‌లో వందే భారత్ రైలు సెట్‌ను నిర్మించాం.
ఆ ట్రైన్ సెట్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తుంది.
అలాగే సినిమాలోని ప్రతి సెట్ ఎంతో సహజంగా ఉంటుంది. ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని పొందుతారని తెలిపారు.