
కోలీవుడ్ లో విషాదం: గజినీ సినిమాలో యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ గా కనిపించిన మనోబాల కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు, దర్శకుడు మనోబాల(69) ఈరోజు మద్యాహ్నం చెన్నైలో కన్నుమూసారు. అయన మరణానికి సరైన కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు.
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ , మనోబాల స్వర్గస్తులైనట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసారు. అనారోగ్య సమస్యల కారణంగా, గత రెండువారాలుగా మనోబాల హాస్పిటల్లో ఉన్నారని సమాచారం.
మనోబాల మృతి పట్ల తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
మనోబాల, తెలుగు వారికి బాగా పరిచయమే. సూర్య నటించిన గజిని సినిమాలో యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ గా కనిపించాడు. రీసెంట్ గా చిరంజీవి నటించిన తెలుగు సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు.
నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా మనోబాల పనిచేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తమిళ నటుడు మనోబాల కన్నుమూత
Heartbreaking to hear that Director/Actor #Manobala sir is no longer with us.
— Gautham Karthik (@Gautham_Karthik) May 3, 2023
Was a true pleasure to work with you sir!
You will be surely missed! 💔
Condolences to family, friends and loved ones...#RIPManobala pic.twitter.com/Ou2QBGsYLs