LOADING...
OTT Movie: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. మెడికల్ ట్రయల్స్‌పై గుబులు పుట్టించే స్టోరీ
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. మెడికల్ ట్రయల్స్‌పై గుబులు పుట్టించే స్టోరీ

OTT Movie: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. మెడికల్ ట్రయల్స్‌పై గుబులు పుట్టించే స్టోరీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 21, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిజ జీవిత సంఘటనలు, ప్రముఖుల జీవిత కథల ఆధారంగా రూపొందే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇటీవలి కాలంలో మంచి స్పందన పొందుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గురించే. ప్రసిద్ధ రచయిత రాజేష్ కుమార్ రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఆస్పత్రుల్లో మెడికల్ ట్రయల్స్ ఎలా నిర్వహిస్తారు? ఫార్మా మాఫియా కార్యకలాపాలు ఎలా ఉంటాయి? అనే అంశాలను తీసుకుని ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

వివరాలు

మెడికల్ మాఫియా చుట్టూ సాగే కథ..

చెన్నై నగరంలో చోటుచేసుకున్న ఒక భయానక సంఘటనతో కథ మొదలవుతుంది. అనుకోకుండా ఒక ఐస్ అమ్మకందారు ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతను తీసుకెళ్తున్న ఐస్ బాక్స్‌లో నరికి వేసిన చేతులు ఉండటం పోలీసులను కలవరపరుస్తుంది. ప్రారంభంలో ఇది సాధారణ నేరంగా అనిపించినా, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా మెడికల్ మాఫియా చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా మానవ అవయవాల అక్రమ రవాణాతో ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. చివరకు ఈ క్లిష్టమైన కేసును వారు ఎలా ఛేదించారు? అసలు నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను తప్పక చూడాలి.

వివరాలు

ట్విస్టుల మీద ట్విస్టులు..

అనూహ్యమైన మలుపులు, ఆకట్టుకునే కథనం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు 'రేగై' అనే పేరు. ఎం. దినకరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బాలహాసన్, పవిత్ర జనని, బోపాలన్ ప్రగదీశ్, వినోదిని వైద్యనాథన్, శ్రీరామ్ ఎం, అంజలి రావ్, ఇంద్రజిత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తం ఆరు ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ సుమారు 18 నుంచి 29 నిమిషాల వరకు ఉంటుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఇది ప్రసారమవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ తమిళ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రైలర్ వీడియో: 

Advertisement