Page Loader
మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే? 
జులై 14న తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ అవుతున్న మామన్నాన్

మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 06, 2023
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరించే ప్రేక్షకులు ఎక్కడైనా ఉంటారు. ఆ నమ్మకంతోనే తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మామన్నాన్ మూవీ తెలుగులో రిలీజ్ అవుతోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రాన్ని నాయకుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ మేరకు నాయకుడు రిలీజ్ పోస్టర్ ని సోషల్ మీడియాలో వదిలింది సురేష్ ప్రొడక్షన్స్. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా, జులై 14వ తేదీన తెలుగులో రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సురేష్ ప్రొడక్షన్స్ వేసిన ట్వీట్