Thandel: ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన.. ఫైరసీపై బన్నివాసు అగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా విడుదలై హిట్ టాక్‌ను అందుకున్న చిత్రం 'తండేల్'. ఈ సినిమా విడుదలైన రోజునుంచే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనపై ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ పోస్టును షేర్ చేశారు.
ఓ మీడియా సంస్థ ద్వారా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో 'తండేల్'ను ప్రదర్శించారని తెలుసుకున్నా. ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాదు, సినిమాకు జీవం పోసే ఎంతోమంది కళాకారులు, దర్శకులు, నిర్మాతలను అవమానించడమే.
దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును కోరుతున్నాను.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బన్నివాసు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
తండేల్‌పై పైరసీ దెబ్బ
నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది.
అయితే, విడుదలైన కొద్దిగంటలకే కొందరు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
అంతేకాదు, ఇటీవల ఓ లోకల్ ఛానల్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శించారు.
ఈ అంశంపై నిర్మాత బన్నివాసు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, ''పైరసీ సినిమాల్ని నాశనం చేస్తోందని, 'గీత గోవిందం' పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి విడుదలవుతున్నారు.
'గీతా ఆర్ట్స్' సినిమాలను పైరసీ చేసిన వారిని, డౌన్‌లోడ్ చేసుకొని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు.