LOADING...
NTRNeel : బరువు తగ్గిన తారక్… నీల్ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక లుక్.. కానీ టెన్షన్‌లో ఫ్యాన్స్!
బరువు తగ్గిన తారక్… నీల్ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక లుక్.. కానీ టెన్షన్‌లో ఫ్యాన్స్!

NTRNeel : బరువు తగ్గిన తారక్… నీల్ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక లుక్.. కానీ టెన్షన్‌లో ఫ్యాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను నెట్లో 'నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్' అని కూడా చర్చిస్తున్నారు. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత, ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీగా భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతూ ఉంది. గతంలో కూడా అనేక సార్లు తారక్ వెయిట్ తగ్గించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం లేటెస్ట్ లుక్ లో ఆయన రికార్డ్ స్థాయిలో బరువు తగ్గినట్టు సమాచారం. ఈ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ కొంత టెన్షన్‌లోకి వెళ్ళారు.

Details

చాలా డిఫరెంట్‌గా ఎన్టీఆర్ లుక్

'ఇంత లీన్‌గా ఎలా? అనే చర్చ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే హై ఓల్టేజ్ యాక్షన్. అయితే ఎన్టీఆర్ ఇంతలా వెయిట్ తగ్గడం, ఈ సినిమాలో నిర్దిష్టంగా ఏదో కొత్త ప్రయోగం జరుగుతోందా అనే సందేహాలను రేకెత్తిస్తోంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కోసం ఈ లుక్ ప్రత్యేకంగా అవసరమని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లోని పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అవుతాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన సీక్వెన్స్ షూట్ జరుగుతోందని ఇండస్ట్రీలో టాక్.

Details

తన

లేటెస్ట్ లుక్ తో రెండో వెర్షన్ కూడా షూట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొన్నటివరకు క్లీన్ షేవ్ లో కనిపించిన ఎన్టీఆర్, తాజాగా ఫుల్ బియర్డ్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుత లుక్ కోసం పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసి, యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో గాయపడ్డారని, అందువల్ల కొన్ని షెడ్యూల్స్ ఆలస్యమవుతాయని, ఈ కారణంగా మేకర్స్ నిర్ణయించిన రిలీజ్ డేట్ కు సినిమా రాకపోవచ్చని టాలీవుడ్ ఇన్‌సైడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.