
Tathvam: ఇంట్రెస్టింగ్ గా 'తత్వం' ఫస్ట్‌లుక్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథనాలు, విభిన్నమైన ఆలోచనలకు గొప్ప ఆదరణ చూపుతుంటారు.
సినిమా చూసే సమయంలో వీరి ఆసక్తిని నిలబెట్టగలిగితే, చిన్న చిత్రమైతేనేం, భారీ విజయాన్ని సాధించగలదు.
ముఖ్యంగా మర్డర్ మిస్టరీ అనే విభాగంలో ఉత్కంఠభరిత కథనం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్ని మక్కువగా ఆవిష్కరిస్తాయి.
ఇప్పుడు అలాంటి ఓ వైవిధ్యభరితమైన కథతో రానున్న చిత్రం 'తత్వం', ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో దినేష్ తేజ్, దష్విక కె. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి అర్జున్ కోల దర్శకత్వం వహిస్తుండగా, త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
వివరాలు
'తత్వం' ఏమిటి?
వంశీ సీమకుర్తి ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి,కల్ట్ సినిమాల నిర్మాత ఎస్‌కేఎన్ తమ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడు అర్జున్ కోల మాట్లాడుతూ.. "మా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి గారికి, ఎస్‌కేఎన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కథలో, ఓ పెళ్లి సంబంధం నిమిత్తం గ్రామానికి వెళ్లిన హీరో, అక్కడ అనూహ్యంగా చోటు చేసుకున్న హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ పరిస్థితుల్లో అతను ఎలా బయటపడతాడు? ఈ సంఘటనల మధ్య అతను తెలిసికొన్న'తత్వం' ఏమిటి? అనేదే ఈ సినిమాకి కేంద్రబిందువు.ప్రతి దృశ్యం ఉత్కంఠను,ఆసక్తిని కలిగించేలా ఉంటుంది" అన్నారు.
వివరాలు
'తత్వం' తప్పకుండా నచ్చుతుంది"
నిర్మాత వంశీ సీమకుర్తి మాట్లాడుతూ.. "ప్రస్తుత తరం ప్రేక్షకులు ఆశించే అంశాల సమాహారంతో పాటు, థ్రిల్ కలిగించే అనుభూతిని ఈ చిత్రం అందిస్తుంది. ఇందులో స్క్రీన్‌ప్లే ప్రధాన బలంగా నిలుస్తుంది. మా పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి గారికి, ఎస్‌కేఎన్ గారికి మా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు 'తత్వం' తప్పకుండా నచ్చుతుంది" అని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దర్శకుడు మారుతీ చేసిన ట్వీట్
Happy to launch the first look poster of #Tatvam 🪓
— Director Maruthi (@DirectorMaruthi) April 7, 2025
Best wishes to @idineshtej and director @arjun2145 and the whole team. #DhashvikaKinthali #VamsiSeemakurthi @chaitanmusic @SKProd201 @TrayathiIshani @editorviplav #BharathPatti #Bhushan #BharatRongali @IamEluruSreenu… pic.twitter.com/gIQcUBxjQN