Page Loader
Colours Swathi: టీచర్‌ గా కలర్స్‌ స్వాతి.. మళ్లీ నవ్వుల జల్లులో ముంచెత్తనున్న 90 స్‌ టీమ్‌ 
టీచర్‌ గా కలర్స్‌ స్వాతి.. మళ్లీ నవ్వుల జల్లులో ముంచెత్తనున్న 90 స్‌ టీమ్‌

Colours Swathi: టీచర్‌ గా కలర్స్‌ స్వాతి.. మళ్లీ నవ్వుల జల్లులో ముంచెత్తనున్న 90 స్‌ టీమ్‌ 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
08:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో (Telangana)ని అంకాపూర్‌ (Ankapur) అనే గ్రామంలో చదువులో వెనుకబడిన ముగ్గురు విద్యార్థుల కథతో కలర్స్‌ స్వాతి (Colours Swathi) ప్రధాన పాత్రంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. టీచర్‌ పాత్రలో కనిపించే స్వాతి ఈ ముగ్గురు అల్లరిపిల్లల్ని కలిసిన తర్వాత ఏం జరిగిందనేది చిత్రంలో చూపించనున్నారు. 90 ఎస్‌ ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో మంచి హిట్‌ అందుకున్న మేకర్స్‌ నిర్మాణంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Details 

నవీన్‌ అఫీషియల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న రెండో ప్రాజెక్టు

ఈ చిత్రానికి ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మేడారం నవీన్‌ అఫీషియల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న రెండో ప్రాజెక్టు ఇది. కలర్స్‌ స్వాతి, నిఖిల్‌ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్రగౌడ్, సిద్ధార్థ్, హర్ష, పవన్, రమేశ్, సురేశ్, నరేందర్‌ నాగులూరి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, సరదా సన్నివేశాలు, సంభాషణలు ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్స్‌ గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ నమ్మకంగా చెబుతోంది.