Page Loader
Kantara 1: 'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం! 
'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం!

Kantara 1: 'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ సినీ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్‌ 1' (Kantara: Chapter 1). 2022లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'కాంతార'కు ఇది ప్రీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా పడనుందన్న వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాలు 

అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదల

తాజాగా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించింది.చిత్ర బృందం తన అధికారిక ఎక్స్‌ (Twitter) ఖాతా ద్వారా ప్రకటన చేస్తూ.. ''మేము ముందుగానే రూపొందించుకున్న షెడ్యూల్‌ ప్రకారమే పనులు కొనసాగుతున్నాయి. షూటింగ్‌ పనులు మా ప్రణాళికల ప్రకారం జరుగుతున్నాయి. సినిమాను అనుకున్న రోజునే, అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. మాపై నమ్మకం ఉంచండి. మీ నిరీక్షణ ఎంత విలువైనదో ఈ చిత్రం విడుదలైన తర్వాత మీరు స్వయంగా అనుభవిస్తారు. దయచేసి ఊహాగానాలకు తావిచ్చే విధంగా ఏ విధమైన అనధికారిక సమాచారం లేదా పోస్టులను పంచుకోవద్దని కోరుతున్నాం'' అని స్పష్టతనిచ్చారు. విడుదల తేదీ అయిన అక్టోబర్‌ 2ను తిరిగి ధృవీకరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

వివరాలు 

పంజుర్లి దేవతకు సంబంధించిన అంశాలు ఈ ప్రీక్వెల్‌లో కీలకం

ఇప్పటికే ప్రకటించిన విధంగా, 'కాంతార చాప్టర్‌ 1' సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన మొదటి భాగమైన 'కాంతార' కన్నడలో విడుదలై భారీ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కాంతార చాప్టర్‌ 1'లో కథ మొదటి భాగం మొదలైనదానికి ముందు జరిగిన సంఘటనలను ప్రాధాన్యంగా చూపించనున్నారు. ముఖ్యంగా పంజుర్లి దేవతకు సంబంధించిన అంశాలు ఈ ప్రీక్వెల్‌లో కీలకంగా ఉండబోతున్నాయి. ఈసారి ఈ చిత్రాన్ని ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.