Page Loader
Devaki Nandana Vasudeva: ఆసక్తిగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ 
Devaki Nandana Vasudeva: ఆసక్తిగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్

Devaki Nandana Vasudeva: ఆసక్తిగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో అరంగేట్రం చేశాడు.తన రెండో సినిమా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ కథ అందించగా,ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ అని పేరు పెట్టారు.

Details 

టీజర్‌లో శ్రీకృష్ణుడు ప్రస్తావన

ఈ టీజర్‌ చూస్తే పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్ లో ఈ మూవీ సాగబోతోందనిపిస్తోంది.ఇది"నీ బిడ్డకి మరణ గండం...లేదా అతని చేతిలో మరోకరికి మరణం"అని చెప్పే వాయిస్‌ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... యుగమేడైనా.. ఏ కలంలోనైనా.. ఈ భూమిమీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు.. వాణ్ణి చంపడానికి దేవుడూ పుడతాడు" అనే డైలాగ్ కథానాయకుడి పుట్టుక ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. డైలాగ్స్ నుండి విజువల్ ప్రెజెంటేషన్ వరకు బ్యాక్ గ్రౌండ్ శ్లోకం వరకు, టీజర్‌లో శ్రీకృష్ణుడు ప్రస్తావనలు ఉన్నాయి.

Details 

అందంగా కనిపిస్తున్న వారణాసి మానస 

ట్రైలర్ లో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించారు. వారణాసి మానస అందంగా కనిపించింది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ధమాకా, బలగం సినిమాలకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. ఇక ఈ టీజర్ ను గుంటూరు కారం థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో అశోక్ గల్లా చేసిన ట్వీట్