NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల
    విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల
    సినిమా

    విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల

    వ్రాసిన వారు Sriram Pranateja
    March 02, 2023 | 12:16 pm 0 నిమి చదవండి
    విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల
    ఈరోజు సాయంత్రమే విడుదల కానున్న విరూపాక్ష టీజర్

    సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష టీజర్ ఈరోజు సాయంత్రం 5గంటలకు విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రకటించింది. నిజానికి విరూపాక్ష టిజర్, నిన్న సాయంత్రమే విడుదల కావాల్సింది. కానీ మెగా ఫ్యాన్, భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్ అసొసియేషన్ అధ్యక్షుడు చనిపోవడంతో టీజర్ విడుదలను వాయిదా వేసారు. విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన, భీమ్లా నాయక్, సార్ సినిమాల ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ ను విడుదల చేసారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్, ప్రేక్షకులకు బాగా నచ్చింది.

    దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష

    అజ్ఞానం భయానికి మూలమని, ఆ భయం మూఢనమ్మకానికి దారి తీస్తుందని, ఒకవేళ ఆ నమ్మకం నిజమైనపుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనపుడు అసలు నిజాన్ని చూపే మరో నేత్రం అంటూ చాలా సీరియస్ గా ఎన్టీఆర్ వాయిస్, గ్లింప్స్ లో వినిపించింది. గ్లింప్స్ వల్ల ఇదొక సీరియస్ సినిమా అని తెలుస్తూనే ఉంది. అదీగాక ఈ కథకు స్క్రీన్ ప్లేని సుకుమార్ అందించాడు. దాంతో విరూపాక్ష మూవీపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. కార్తీక దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా రూపుదిద్దుకుంటున్న విరూపాక్ష, ఏప్రిల్ 21న విడుదలవుతుంది.

    విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల

    Be all eyes to witness The Mystic World of #Virupaksha 👁🔥

    Supreme Hero @IamSaiDharamTej's #VirupakshaTeaser Today @ 5PM.#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/EmNKB636Yz

    — SVCC (@SVCCofficial) March 2, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే సినిమా
    ఇంటి పేర్లనే సినిమా టైటిల్ గా మార్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా
    ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్? సినిమా
    సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023