
Mirai: తేజ సజ్జా మరో సర్ప్రైజ్..మైండ్ బ్లాకింగ్ గా "మిరాయ్" గ్లింప్స్
ఈ వార్తాకథనం ఏంటి
హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ తదుపరి చిత్రం 'మిరాయ్'.
ఈ సినిమా చైనా, జపాన్ సరిహద్దులో, ఒక మనిషిని దేవుడి స్థాయికి చేర్చే శక్తి కలిగిన తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించే ఏకైక బాధ్యత కలిగిన ఒక పోరాట యోధుడి చుట్టూ తిరుగుతుంది.
ఈ చిత్రంలో సూపర్ యోధా గా తేజ కనిపించనున్నాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇప్పుడు టైటిల్ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
Details
7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
"మిరాయ్" అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసిన మేకర్స్ ఒక ఊహించని ట్రీట్ ని అయితే ఈ సినిమాతో అందిస్తున్నారని చెప్పాలి.
ఈ గ్లింప్స్ లోని యాక్షన్ విజువల్స్ అయితే మైండ్ బ్లాకింగ్ గా బిగ్ స్క్రీన్స్ పై ప్రామిసింగ్ ట్రీట్ ని అందించబోతున్నాయి ఆ యాక్షన్ సీక్వెన్స్ లో తేజ ప్రెజెన్స్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 19న 3డి లో రిలీజ్ చేయబోతున్నారు.
అలాగే ఈ సినిమా 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥
— People Media Factory (@peoplemediafcy) April 18, 2024
-- https://t.co/k4tycunRkA
In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥
SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE