LOADING...
Mirai: తేజ సజ్జా డేరింగ్‌ స్టంట్‌.. 'మిరాయ్‌' ట్రైన్‌ ఎపిసోడ్‌ వీడియో వైరల్!

Mirai: తేజ సజ్జా డేరింగ్‌ స్టంట్‌.. 'మిరాయ్‌' ట్రైన్‌ ఎపిసోడ్‌ వీడియో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం 'మిరాయ్‌' (Mirai). ఇందులో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి.

Details

కథకు కీలకమైన మలుపు

తాజాగా చిత్రబృందం ఒక బీటీఎస్‌ వీడియోను విడుదల చేసింది. ఇందులో ట్రైన్‌ సీక్వెన్స్ గురించి వివరించారు. ఈ సన్నివేశం చిత్రంలో చాలా పెద్ద ఛాలెంజ్‌గా నిలిచిందని, కథకు కీలకమైన మలుపు తిప్పే ఎపిసోడ్‌గా మారిందని టీమ్‌ తెలిపింది. ముఖ్యంగా ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం తేజ సజ్జా రిస్క్‌ తీసుకుని స్వయంగా నటించారని, దాంతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ అనుభూతి కలుగుతుందని క్రూ సభ్యులు వెల్లడించారు.