
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. యూత్‌ని ఊపేస్తున్న 'వైబ్ ఉంది బేబీ'!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యోధుడి పాత్రలో తేజ సందడి చేయనుండగా, రితికా నాయక్ కథానాయికగా అలరించనున్నారు. మరోవైపు, విలన్‌గా మంచు మనోజ్ వినూత్న అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా కార్తీక్ ఘట్టమనేని, దీనిని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 'మిరాయ్' చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా 2డీ, 3డీ ఫార్మాట్లలో, మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి.
Details
త్వరలోనే మరిన్ని అప్డేట్స్
ఇటీవలే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'వైబ్ ఉంది బేబీ' పాటకు యువత నుంచి మంచి స్పందన వస్తోంది. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌కు అర్మాన్ మాలిక్ చిలిపి గాత్రం కలసి పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యూత్‌ఫుల్ బీట్‌తో పాటు ఎనర్జిటిక్ మూడ్ ఈ పాటను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. చిత్రానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఈ ఫన్‌ఫుల్ సాంగ్‌ను ఆస్వాదిస్తూ ఉండండి!