తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయే రిలీజ్ తేదీ ఏప్రిల్ 28: ఈరోజున రిలీజైన భారీ చిత్రాలు
ఏప్రిల్ 28.. తెలుగు సినిమా విడుదల తేదీల్లో ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈరోజున రిలీజైన చిత్రాలు భారీ సక్సెస్ సాధించాయి. ఆ సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అడవి రాముడు: నందమూరి తారక రామారావు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, 1977లో ఏప్రిల్ 28న రిలీజైంది. జయప్రద, జయసుధ హీరోయిన్లుగా కనిపించారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, 3కోట్లు వసూళ్ళు చేసి తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. యమలీల: కమెడియన్ ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల, బాక్సాఫీసును షేక్ చేసింది. అమ్మ సెంటిమెంట్ అందరికీ నచ్చడంతో కలెక్షన్ల వర్షం కురిసింది.
1800కోట్ల బాహుబలి 2
పోకిరి: పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి చిత్రం, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. 12కోట్లతో రూపొంది 66కోట్ల వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని డైలాగులు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయంటే, బాక్సాఫీసు వద్ద పోకిరి ఎంత ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2: 2017లో రిలీజైన బాహుబలి 2, భారతదేశం మొత్తాన్ని తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. తెలుగు సినిమా స్థాయి వంద, రెండు వందల కోట్లు అని లెక్కలేసుకుంటున్న సమయంలో, 1800కోట్ల వసూళ్ళను సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.