
ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడానికి ప్రతీ వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద విరూపాక్ష, ఏజెంట్, పీఎస్-2 చిత్రాలు సందడి చేస్తున్నాయి.
ఆ సందడికి మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ వారం సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటి విశేషాలేంటో చూద్దాం.
ఉగ్రం:
50కి పైగా సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన అల్లరి నరేష్, ఈసారి తనలోని ఉగ్ర రూపాన్ని చూపించబోతున్నాడు.
నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాతో మే 5వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిర్ణా నటిస్తోంది.
నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Details
మార్వెల్ స్టూడియో నుండి వస్తున్న అద్భుతం
రామబాణం:
లక్ష్యం, లౌక్యం సినిమాలతో సక్సెస్ అందుకున్న కాంబినేషన్.. గోపీచంద్, శ్రీవాస్ కలిసి మరోసారి రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మే5వ తేదీన రిలీజ్ అవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా కనిపిస్తోంది. గెటప్ శ్రీను కమెడియన్ గా కనిపిస్తున్నాడు.
పీపుల్ మీడీయా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3:
మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న చిత్రం ఇది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ అవుతుంది.