
ఈవారం సినిమా: అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద కళకళ లాడుతుంటాయి. ఈసారి కూడా మంచి మంచి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో వచ్చే సినిమాల గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం. రూల్స్ రంజన్: కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాకు రాతినం కృష్ణ దర్శకత్వం వహించారు. మీటర్ ఫ్లాప్ తర్వాత కిరణ్ నుండి వస్తున్న ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.
Details
థియేటర్లలోకి వస్తున్న సుధీర్ బాబు కొత్త సినిమా
మామా మశ్చీంద్ర: సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను హర్ష వర్ధన్ తెరకెక్కించారు. ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 6న థియేటర్లలోకి మామా మశ్చీంద్ర వచ్చేస్తుంది. మ్యాడ్: సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తీసుకువస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మ్యాడ్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ కాలేజ్ డ్రామా, అక్టోబర్ 6న రిలీజ్ అవుతుంది.
Details
మంత్ ఆఫ్ మధు
నవీన్ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రేయా నేవైల్, మంజులా ఘట్టమనేని ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తెరమీద మంచి ఎమోషనల్ సినిమా చూడబోతున్నామన్న నమ్మకాన్ని టీజర్, ట్రైలర్ ఇచ్చేసాయి. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 6న రిలీజ్ అవుతుంది. 800: టెస్ట్ క్రికెట్ లో 800వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథే 800. ఈ సినిమాలో ముత్త మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎం.ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 6న విడుదల అవుతుంది.