Mitra mandali: ఓటీటీలోకి మిత్ర మండలి… విడుదలైన 20 రోజుల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల విడుదలైన తెలుగు కామెడీ చిత్రం 'మిత్ర మండలి' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలై మూడు వారాలకే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో బుధవారం (నవంబర్ 5) అధికారికంగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. నవంబర్ 6 నుండి చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉండనుంది.
వివరాలు
థియేటర్లలో సాధారణ స్పందన
విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ విడుదల ద్వారా ప్రేక్షకుల నుండి మెరుగైన స్పందన పొందాలనే ఆశతో టీమ్ ఎదురుచూస్తోంది. కథ ఏంటంటే.. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో నలుగురు స్నేహితుల ప్రేమ కథ,దానితో జరుగే పరిణామాలు ప్రధాన కథాంశంగా సాగుతాయి. జంగ్లీపట్నం అనే ఊరిలో నివసించే చైతన్య (ప్రియదర్శి),సాత్విక్ (విష్ణు),రాజీవ్ (ప్రసాద్ బెహరా), అభి (రాగ్ మయూర్)నలుగురూ స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటారు.ఇదిలా ఉండగా స్వేచ్ఛను అనుకోకుండా ఎవరో కిడ్నాప్ చేస్తారు. కేసు విచారణలో వెన్నెల కిశోర్ పోలీస్ అధికారిగా ప్రవేశిస్తాడు.
వివరాలు
బిజినెస్ వివరాలు
స్వేచ్ఛను ఎవరు అపహరించారు? చైతన్య-స్వేచ్ఛ ప్రేమకు ఏమైంది? అనేది సినిమాకు కథను ముందుకు తీసుకెళ్తుంది. మిత్ర మండలి సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ కలిపి రూ.9.50 కోట్లని టాక్. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సుమారు రూ.19 కోట్ల వరకూ వసూలు చేసింది.