12A Railway Colony: తెలుగు అమ్మాయిలకు అవకాశం వస్తే వేరే భాషలోకి వెళ్తారు : అల్లరి నరేష్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లరి నరేష్ హీరోగా, కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందించిన '12ఏ రైల్వే కాలనీ' (12A Railway Colony) సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించగా, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా, విడుదల ముందు నిర్వహించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం ఉంటే భయం అక్కర్లేదని, ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Details
ఈ సినిమాపై భారీ అంచనాలు
అలాగే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఈ మధ్య వార్తలు జోరుగా వస్తున్నాయి. దీనిపై కూడా ఆయన స్పందించారు. అవకాశాలు వచ్చినా, చాలామంది ఇతర భాషల వైపు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. '12ఏ రైల్వే కాలనీ' విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తుండగా, నరేశ్ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.