Aarambham: రెండు వారలు కాకముందే.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ మూవీ
"ఆరంభం" పేరుతో విడుదలైన తెలుగు సినిమా ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది. ఈసైన్స్ -ఫిక్షన్ కధ, కధనం బాగున్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా డబ్బులు రాబట్టలేకపోయింది. ఆశించినంత రివ్యూలు కూడా రాలేదు.తాజాగా తెలిసింది ఏమంటే ఈ సైన్స్-ఫిక్షన్ మూవీని త్వరలో తెలుగు డిజిల్ ప్లాట్ ఫారం ఈ టీవి విన్ లో మే 23న ప్రసారం కానుంది. అంటే థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకే ఇది ఓటిటి స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నట్లు అయింది. మోహన్ భూషన్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు.సుప్రిత సత్యనారాయణ్ ,భూషన్ లక్ష్మీ మీసాల,బొడ్డేపల్లి అభిషేక్ ,సురభి ప్రభావతి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అభిషేక్ వి తిరుమలేష్ నిర్మాత కాగా సింజిత్ యర్రమల్లి సంగీత దర్శకత్వం వహించారు.