LOADING...
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి సందర్భంగా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తెలుసు కదా' (Telusu Kada) సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న (నవంబర్ 14) నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారారు.

Details

కథ ఏమిటంటే?

వ‌రుణ్‌ (సిద్ధు జొన్నలగడ్డ) ఓ అనాథ. జీవితంలో తనకంటూ ఒక కుటుంబం ఉండాలన్న ఆకాంక్షతో జీవిస్తాడు. కాలేజీ రోజుల్లో రాగ (శ్రీనిధి శెట్టి)తో ప్రేమలో పడతాడు. ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ రాగ అతడిని తిరస్కరించి దూరమవుతుంది. ఆ బాధను తట్టుకొని కొత్త జీవితం ప్రారంభించాలనే నిశ్చయంతో పెళ్లి సంబంధాలు చూసే వ‌రుణ్‌కి అంజలి (రాశీఖన్నా) పరిచయం అవుతుంది. ఇద్దరి మనసులు కలుస్తాయి. వివాహం చేసుకుని ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇద్దరికీ పిల్లలంటే ఎంతో ఇష్టం. అయితే, ఆ సంతోష జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.

Details

ప్రేమ, భావోద్వేగాల మేళవింపు 'తెలుసు కదా'

వ‌రుణ్‌, అంజలి బంధం ఒక తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటుంది. అదే సమయంలో రాగ మళ్లీ వ‌రుణ్ జీవితంలోకి వస్తుంది. ఆమె తిరిగి ఎందుకు వచ్చింది? వ‌రుణ్‌ని అప్పట్లో ఎందుకు వదిలిపోయింది? ఆమె రాకతో వ‌రుణ్‌, అంజలి జీవితాల్లో ఏ మార్పులు చోటుచేసుకున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే 'తెలుసు కదా' కథ యొక్క మర్మం. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాల నడుమ నడిచే ఈ సినిమా, కుటుంబ కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకుల మనసులను తాకేలా తెరకెక్కింది.