Rajinikanth: తలైవా బర్త్‌డే.. ఆసక్తికర వ్యాఖ్యలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, "తిరు రజినీకాంత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని పేర్కొన్నారు. రజినీకాంత్ నటన తరతరాల ప్రేక్షకులను ఆకర్షించిందని, ఆయనకు లభించిన అపారమైన ప్రజాదరణ అసాధారణమని ప్రధానమంత్రి ప్రశంసించారు. వివిధ శైలులలో, విభిన్న పాత్రలతో భారత సినిమా రంగంలో స్థిరమైన ప్రమాణాలను నెలకొల్పిన నటుడని అభివర్ణించారు. ఈ సంవత్సరం రజినీకాంత్ సినీ ప్రయాణంలో ప్రత్యేకమైనదని మోదీ గుర్తు చేశారు.
Details
75వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రజనీ
రజినీకాంత్ చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల మహత్తర ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం. ఆయన మరింతకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, అభిమానులకు తన ప్రత్యేక శైలి నటనతో ఇంకా ఎన్నో సంవత్సరాలు వినోదాన్ని అందించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక రజినీకాంత్ ఈరోజు 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమిళ హీరో అయినప్పటికీ, తెలుగు సహా అనేక భాషల్లో ఆయనకు అశేష అభిమానాభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా రోబో (Enthiran) సినిమాతో దేశవ్యాప్తంగా మరింత పెద్ద స్టార్‌డమ్‌ను సంపాదించారు. 75 ఏళ్ల వయస్సులో కూడా అదే ఉత్సాహం, జోష్‌తో సినిమాలు చేస్తూ, తన ఎనర్జీతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.