Page Loader
#Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు 

#Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు 

వ్రాసిన వారు Sriram Pranateja
May 23, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తలపతి విజయ్ సినిమాలోఎన్టీఆర్ నటించబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇటీవల తలపతి విజయ్ 68వ సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని ప్రకటించారు కూడా. అయితే ఈ ప్రకటన వీడియోను ఒక పజిల్ మాదిరిగా ఇచ్చారు. ఒక పజిల్ లో రకరకాల అక్షరాలను పెట్టి అందులోంచి తలపతి విజయ్, వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడు యువన్ పేరును మార్క్ చేసి, వీళ్ళందరూ తలపతి 68వ సినిమాకు పనిచేస్తున్నారని వెల్లడి చేసారు. ఆ పజిల్ లో ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు కనిపించడంతో, విజయ్ 68వ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని అంటున్నారు.

Details

ఎన్టీఆర్ పేరును మార్క్ చేస్తున్న అభిమానులు 

ఎన్టీఆర్ అన్న మూడక్షరాలను మార్క్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తలపతి 68వ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ నిజంగానే నటిస్తున్నారా? లేక ఏదో యాదృఛ్ఛికంగా ఎన్టీఆర్ అన్న మూడక్షరాలను పజిల్ లో చూపించారా అన్నది తెలియాలి. ఒకవేళ ఎన్టీఆర్ నిజంగా విజయ్ సినిమాలో కనిపిస్తే, అభిమానులకు పండగే. తలపతి 68వ సినిమాను ఎజీఎస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. ఇకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా ఈ మధ్యే రిలీజైంది. ఈ సినిమాకు థియేటర్ల వద్ద సరైన స్పందన రాలేదు.