కాశ్మీర్, చెన్నై తర్వాత ఆంధ్రప్రదేశ్ చేరుకున్న లియో టీమ్: షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?
తలపతి విజయ్ లియో సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. అక్టోబర్ లో విడుదల కానున్న నేపథ్యంలో తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని లియో టీమ్ భావిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మొన్నటి వరకు కాశ్మీర్, చెన్నై ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న లియో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. తిరుపతిలోని తలకోన ప్రాంతంలోని జలపాతం వద్ద లియో చిత్రీకరణ జరుగుతోంది. దీంతో చిత్ర యూనిట్ మొత్తం తలకోన చేరుకుంది. అక్కడ విజయ్ ని చూసిన అభిమానులు అంతా ఒక్కసారి చుట్టుముట్టారు. క్యారవాన్ దిగిన విజయ్, అందరికీ హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.