Chandrabose: నా మీద పాట రాసి బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్.. 'పర్‌ఫ్యూమ్' ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రబోస్
స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు ఎలాంటి సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో 'పర్‌ఫ్యూమ్' అనే చిత్రం రాబోతోంది. జీడీ స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా 'ఫర్‌ఫ్యూమ్' నిర్మించారు. ఇందులో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అనంతరం చంద్రబోస్, సుచిత్ర దంపతులను ఘనంగా సత్కరించారు. ఇందులో చంద్రబోస్ మీద పాట రాసి, ఆయన ముందే మూవీ టీం వినిపించింది.
దర్శకుడు జెడీ పర్‌ఫ్యూమ్ సినిమాను అద్భుతంగా తీశాడు : చంద్రబోస్
ఇప్పటివరకూ తాను 3700 పాటలు రాశానని, తనపై ఓ పాట రాసి తనకు బహుమతిగా ఇచ్చిన 'పర్‌ఫ్యూమ్' చిత్ర బృందానికి థ్యాంక్స్ అని చంద్రబోస్ చెప్పారు. దర్శకుడు జెడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, ఇందులో తాను ఓ పాట రాశానని, సంగీత దర్శకుడు అజయ్ చక్కటి బాణి అందించారన్నారు. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని హీరో చేనాగ్ చెప్పారు.