
కీడా కోలా ట్రైలర్: నవ్వులతో నిండిపోయిన తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ సినిమాలతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పేరు తెచ్చుకున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం కీడా కోలా.
చైతన్య రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ని రానా దగ్గుబాటి చేతుల మీదుగా లాంచ్ చేయించారు.
దాదాపు 3నిమిషాల ట్రైలర్ లో ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి.
ట్రైలర్ మొదట్లో నవ్వు తెప్పించే అంశాలను చూపించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ అంశాలు కూడా ట్రైలర్లో కనిపించాయి.
వీజీ సైన్మా బ్యానర్లో వివేక్ సాగర్ సంగీతంతో వస్తున్న కీడా కోలా, నవంబర్ 3న విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రానా దగ్గుబాటి ట్వీట్
Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7
— Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023