LOADING...
Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా 
ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా

Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి మీనా తన సినీ జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి సంబంధించిన ఒక సంఘటన ప్రత్యేకంగా నిలిచింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ మీనా చిరునవ్వులు చిందించారు. ఆ సమయంలో ఊటీలో మిథున్‌ చక్రవర్తికి చాలా పెద్ద హోటల్‌ ఉండేది. ఎన్నో సినిమాలు అక్కడే షూటింగ్‌ జరిగేవి. ఆయన నన్ను చూసినప్పుడల్లా 'ఒక సినిమా అయినా నాతో చేయి' అని అడిగేవారు. 'నీ డేట్స్‌ ఇవ్వు, నాతో ఒక్క సినిమా చేయి' అంటూ బలంగా అభ్యర్థించేవారు. కానీ ఆ సమయంలో నేను తెలుగు, తమిళ్‌ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాకు సమయం కేటాయించలేకపోయాను.

Detailsత

ఆ హోటల్ లో రూమ్ బుక్ చేయొద్దని కోరా

తర్వాత ఆయన హోటల్‌లో షూటింగ్‌ ఉంటేనే నాకు భయం వేసేది. 'అయ్యో, మిథున్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేయొద్దు' అని సూటింగ్‌ యూనిట్‌కి చెప్పేదాన్ని," అంటూ మీనా నవ్వుతూ అన్నారు. మీనా చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమె మాటలను సరదాగా తీసుకుంటే, మరికొందరు మిథున్‌ ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలపై పెద్దగా స్పందించని మీనా ఈసారి పాత జ్ఞాపకాలను తెరమీదకు తేవడంతో సినీ వర్గాల దృష్టి మళ్లీ ఆమె వైపు మళ్లింది.