Page Loader
Akhil: సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్
సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్

Akhil: సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ తారల క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) దశాబ్దం కిందట మొదలై, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా ఈ క్రికెట్‌ లీగ్‌ కొత్త సీజన్‌ మొదలు కావడానికి ముందు, హైదరాబాద్‌లో 'తెలుగు వారియర్స్' జట్టు తమ నూతన జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ జట్టు కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌, పలువురు సినీ తారలు, నిర్మాత సచిన్‌ జోషి పాల్గొన్నారు. ఈ ఏడాది వారు కప్పు గెలుస్తామని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. "సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 13 సంవత్సరాల క్రితం విష్ణు ప్రారంభించారు. మొదట్లో ఈ ఐడియా పని చేస్తుందా? లేదో ఎవరికీ తెలియదు, కానీ ఈ రోజు మనం 11వ సీజన్‌కు వచ్చామన్నారు.

Details

ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం

ఈ గేమ్‌ను కొనసాగించడానికి మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలిచాం. ఈసారి కూడా కప్పు గెలవాలని ఆశిస్తున్నాం. ఆటతోపాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్‌ చేయాలని అనుకుంటున్నామని అఖిల్‌ పేర్కొన్నారు. క్రికెట్‌ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ లీగ్‌ వల్ల తాను క్రికెటర్‌గా నైపుణ్యం చూపించేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుండి మార్చి 2 వరకు జరుగనున్న సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది.