DADA Movie : నటసింహం వస్తున్నాడు.. 'దాదా' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'దాదా' (DADA). 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణకు గాయం కావడంతో 'దాదా' షూటింగ్‌కు గత కొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు మేకర్స్. అయితే ఇటీవలే చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం బాలయ్య లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
వివరాలు
ఆక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి
తాజా సమాచారం ప్రకారం.. 'దాదా' చిత్రానికి సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం అన్ని పనులను పూర్తి చేసి.. ఈ ఏడాది డిసెంబర్ 24న 'దాదా' చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.