Suma Kanakala: 'ప్రేమంటే' చిత్రంతో మరోసారి వెండితెరపై యాంకర్ సుమ..
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి చెప్పుకోవడం అంటే బుల్లితెరపై ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవడమే.
తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుమ, ఎన్నో సంవత్సరాలుగా టీవీ యాంకరింగ్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
పలు యాంకర్లు వస్తున్నా, పోతున్నా, సుమ మాత్రం తన స్థానం ప్రాబల్యాన్ని కొనసాగిస్తోంది.
పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ప్రమోషన్స్ వంటి కార్యక్రమాల్లో సుమ హోస్ట్‌గా ఉండటం అనివార్యం. అంతేకాక, హీరోలు, హీరోయిన్‌లు కూడా సుమ మాటలను అభిమానిస్తుంటారు.
వివరాలు
ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా,హీరో రానా
సుమ ఇటీవల"జయమ్మ పంచాయతీ"చిత్రంతో వెండితెరపై కనిపించింది.
ఆమె పాత్రకు, యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి..కానీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
ఆ తర్వాత కొంత సమయం విరామం తీసుకున్న సుమ, ఇప్పుడు"ప్రేమంటే"చిత్రంతో మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది.
ఆదివారంఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు.ఈపూజ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా,హీరో రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రానా ముహూర్తపు సన్నివేశానికి ఫస్ట్ క్లాప్ కొట్టగా,సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు.
థ్రిలింగ్,రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు.
సుమ పాత్ర కూడా ఇందులో కీలకమైనదిగా చెప్పబడుతోంది.ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఇందుకు సంబదించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.