Loading...
SPIRIT : 'స్పిరిట్' బిజినెస్‌ మామూలుగా లేదు.. కర్ణాటక రైట్స్‌కు భారీ ధర చెల్లించిన నిర్మాత!
'స్పిరిట్' బిజినెస్‌ మామూలుగా లేదు.. కర్ణాటక రైట్స్‌కు భారీ ధర చెల్లించిన నిర్మాత!

SPIRIT : 'స్పిరిట్' బిజినెస్‌ మామూలుగా లేదు.. కర్ణాటక రైట్స్‌కు భారీ ధర చెల్లించిన నిర్మాత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్‌ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నప్పటికీ, విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్‌ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్' కర్ణాటక థియేట్రికల్‌ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ప్రభాస్‌ సినిమాలకు ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ హక్కుల కోసం సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

వివరాలు

థియేట్రికల్‌ హక్కులపైనా డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ

ఈ ఒప్పందంతో 'స్పిరిట్' ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో మరో కొత్త బెంచ్‌మార్క్‌ నెలకొల్పినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటక హక్కులు భారీ ధరకు అమ్ముడవడంతో, మిగిలిన ప్రాంతాల థియేట్రికల్‌ హక్కులపైనా డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు సమాచారం.

త్వరలోనే ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది. టి-సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.

'యానిమల్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్‌ వర్గాల్లో మరింత క్రేజ్‌ ఏర్పడింది.

భూషణ్‌ కుమార్‌తో కలిసి సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT