SSMB 29: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ రివీల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గానీ, ఇతర ముఖ్య వివరాలు గానీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఒక కీలక ప్రకటనకు సిద్ధమవుతోందని సమాచారం. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారని, ఆ సందర్భంలో గ్లిమ్స్ వీడియోతో పాటు సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ,రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు ఏదీ నిర్ధారించలేదు. ఈ నవంబర్ 15న జరుగబోయే ఈవెంట్‌లోనే అన్ని ఊహాగానాలకు ముగింపు పలికే అవకాశం ఉంది.
Details
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు
కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. అయితే ఆమె పాత్ర హీరోయిన్‌ది కాదని సమాచారం.దాంతో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేశారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా కథ నేపథ్యం అడవిలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతుందనే ప్రచారం ముందుగానే వినిపించింది. అయితే అసలు కథ ఏంటీ, రాజమౌళి ఈసారి ఏ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారో అన్న దానిపై పూర్తి క్లారిటీ మాత్రం గ్లిమ్స్ విడుదలైన తర్వాతే రావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి.