Page Loader
Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర పస్ట్ హీరో ఈ కమెడియనే! 
Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర పస్ట్ హీరో ఈ కమెడియనే!

Sudha Kongara: జాతీయ అవార్డు విజేత డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర పస్ట్ హీరో ఈ కమెడియనే! 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుధా కొంగ‌ర‌.. 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో డైరెక్ట‌ర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇదే సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. దర్శకురాలిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగ‌ర‌తో సినిమాలు చేసేందుకు తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీ హీరోలు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగ‌ర‌ మొదటి సినిమా ఏదో చాలా మందికి తెలియదు. ఆమె దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'ఆంధ్ర అంద‌గాడు'. 2008లో విడుదలైన ఈ సినిమాలో హీరో ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ కావడం గమనార్హం.

సుద

మాధ‌వ‌న్ సినిమాతో తొలి హిట్ అందుకున్న సుధ కొంగర

రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన 'ఆంధ్ర అంద‌గాడు' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకే కనుమరుగైపోయింది. ఫలితంగా ఈ సినిమా తర్వాత సుధ కొంగరకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమె చాలా రోజులు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అనంతరం మాధ‌వ‌న్ హీరోగా 'ఇరుది సుట్రు' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాతో ఆమె తొలి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అక్ష‌య్ కుమార్‌తో చేస్తున్న 'ఆకాశం నీ హ‌ద్దురా' రిమేక్ రిలీజ్‌‌కు సిద్ధంగా ఉంది. రిమేక్‌లో సూర్య గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు.