
This Week Telugu Movies: సినిమాల పండుగ మొదలైంది.. వినాయకచవితి కానుకగా థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
పౌరాణిక నేపథ్యంతో.. వర్తమాన సంఘటనలతో పాటు పౌరాణిక నేపథ్యాన్ని మేళవించి తెరకెక్కిన చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్'. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహా కీలక పాత్రల్లో నటించారు. విజయ్‌పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 29న (వినాయకచవితి కానుకగా) విడుదల కానుంది. ఇది కంటెంట్ ప్రధానమైన సినిమా. హీరో, విలన్ అంటూ ఎవ్వరూ లేరు. ప్రతి పాత్రకీ భిన్నమైన కోణం ఉంటుంది. ప్రతి ఒక్కరి అంతర్గత యుద్ధమే ఈ చిత్రంలోని ప్రత్యేకత అని చిత్రబృందం చెబుతోంది.
Details
కుటుంబ కథా చిత్రంతో
నటుడు నారా రోహిత్ తన కొత్త సినిమా 'సుందరకాండ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడిగా వెంకటేశ్ నిమ్మలపూడి పరిచయం అవుతుండగా, సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మించారు. వృతి వాఘని కథానాయిక. రోమ్‌కామ్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా, జీవితంలోని అన్ని భావోద్వేగాలను చూపిస్తూ, వినోదాత్మకంగా సాగేలా రూపొందిందని ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
రొమాంటిక్ కామెడీగా
కేరళలోని అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగే ప్రేమ ప్రయాణం, వినోదాన్ని మిళితం చేసిన చిత్రం 'పరమ్ సుందరి'. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించగా, తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదల అవుతోంది. కేరళ అమ్మాయిగా జాన్వీ, దిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాను వినోదాత్మక రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దినట్లు తెలియజేస్తున్నాయి.
Details
గ్రామీణ నేపథ్యంలో
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం 'కన్యాకుమారి'. సృజన్ అట్టాడ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదల అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో రైతుగా శ్రీచరణ్, ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలని కలలు కనే అమ్మాయిగా గీత్ అలరించనున్నారు.
Details
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
నెట్‌ఫ్లిక్స్ అబిగైల్ (తెలుగు) - ఆగస్టు 26 మెట్రో ఇన్ డినో (హిందీ) - ఆగస్టు 29 కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) - ఆగస్టు 30 అమెజాన్ ప్రైమ్ అప్‌లోడ్ 4 (వెబ్‌సిరీస్) - ఆగస్టు 25 హాఫ్ సీఏ2 (హిందీ సిరీస్) - ఆగస్టు 27 సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ) - ఆగస్టు 29 జియో సినిమా రాంబో ఇన్ లవ్ (తెలుగు) - ఆగస్టు 29