Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 9 ఫినాలే.. విన్నర్‌పై ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఫినాలే ప్రారంభం కానుంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీజన్‌లో లేనివిధంగా ఈ సీజన్‌లో కామనర్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. అనేక టాస్కులు, పరీక్షలు, ఎలిమినేషన్లను తట్టుకొని చివరి దశకు చేరుకున్న టాప్ 5 కంటెస్టెంట్లు ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ సీజన్ టైటిల్ రేసులో ప్రస్తుతం రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదవుతుందనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Details
టైటిల్ కోసం గట్టి పోటీ
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డిమాన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరి మధ్యలోనే టైటిల్ కోసం గట్టి పోటీ కొనసాగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఇద్దరు తనూజ, కళ్యాణ్ పడాల అని చెబుతున్నారు. కళ్యాణ్ పడాల బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒక కామనర్‌గా అడుగుపెట్టాడు. అనేక వారాల పాటు సాగిన పోటీలో ప్రతి ఎలిమినేషన్‌లో ప్రేక్షకుల మద్దతుతో నిలబడుతూ ముందుకు సాగాడు. చివరకు టాప్ 5లో చోటు దక్కించుకొని, టైటిల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకున్నాడు. కామనర్‌గా వచ్చి ట్రోఫీ దాకా చేరడం వల్ల కళ్యాణ్ గెలిస్తే అది చరిత్రాత్మక విజయంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Details
తనూజ ఆటతీరుపై ప్రశంస
ఇక తనూజ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో అత్యంత టఫ్ ఫైటర్స్‌లో ఒకరిగా ఆమెను పలువురు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిది సీజన్లు పూర్తయినప్పటికీ, ఒక్క లేడీ కూడా విన్నర్‌గా నిలవలేదు. బిందు మాధవి ఓటీటీ సీజన్‌లో విజేతగా నిలిచినా, అది ప్రధాన టీవీ సీజన్‌కు వర్తించదు. ఈ నేపథ్యంలో తనూజ టైటిల్‌ను గెలిస్తే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలి మహిళా విజేతగా ఆమె నిలుస్తుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తనూజ-కళ్యాణ్ పడాల మధ్యే టైటిల్ కోసం టఫ్ ఫైట్ కొనసాగుతోందని టాక్ నడుస్తోంది.