LOADING...
korean kanakaraju: 'కొరియన్ కనకరాజు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!
'కొరియన్ కనకరాజు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

korean kanakaraju: 'కొరియన్ కనకరాజు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను చిత్రబృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా 'కమ్సాహంనిదా' అనే మొదటి పాట ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను సిద్ది శ్రీరామ్ ఆలపించగా, పూర్తి సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రోమోను సంగీత దర్శకుడు ఎస్. తమన్, వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ మధ్య జరిగిన సరదా సంభాషణలతో వినోదాత్మకంగా రూపొందించారు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు

ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్

భారతీయ యువకుడు కనకరాజు, కొరియన్ సంస్కృతికి మధ్య ఉండే సంబంధాన్ని తన ప్రత్యేకమైన కామెడీ స్టైల్‌లో దర్శకుడు చూపించబోతున్నారు. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయ్యింది. మిగిలిన చివరి షెడ్యూల్‌ను దక్షిణ కొరియాలోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేయనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత వస్తున్న ఈ విభిన్నమైన కథతో వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఈ వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిలీజైన ప్రోమో

Advertisement