Bhama Kalapam 2: భామాకలాపం 2 అప్డేట్ వచ్చేసింది.. ఈసారి థియటర్లలో సందడి చేయనున్న ప్రియమణి
హీరోయిన్ ప్రియమణి (Priyamani) నటించిన భామాకలాపం మూవీ డైరక్టుగా ఓటిటిలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. తాజాగా సీక్విల్ మాత్రం థియోటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సీక్వెల్‌కు సంబంధించిన మేకర్స్ గురువారం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు. ఇవాళ భామా కలాపం 2 (Bhama Kalapam 2) ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రియమణి వాక్యుమ్ క్లీనర్‌ను పట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది.
క్రైమ్ అండ్ కామెడీ పాయింట్ తో తెరకెక్కుతున్న భామా కలాపం 2
భామా కలాపం 2 సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో భామా కలాపం సినిమాను డైరెక్టుగా ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అభిమన్యు దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కవాళ్ల విషయాల పట్ల ఆసక్తిని చూపే ఓ గృహిణి మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది. ఆ నేరం నుంచి ఆమె బయటపడేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సీక్విల్ క్రైమ్ అండ్ కామెడీ పాయింట్ తోనే రూపొందుతున్నట్లు తెలుస్తోంది.