
Rishabh Pant: 'విజయమే లక్ష్యం.. జట్టు కోసం నిత్యం సిద్ధమే'.. రిషబ్ పంత్ ఎమోషనల్ మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ఉత్కంఠ భరితంగా డ్రాగా ముగిసింది. భారత ప్లేయర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల అద్భుత ప్రదర్శన మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఈ పోరాటంతో భారత్ ఓటమిని తప్పించుకుంది. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. గాయపడినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకోసం బరిలోకి దిగిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో అవసరం ఉంటే బ్యాటింగ్‌కు దిగతాడని బీసీసీఐ ప్రకటించినా.. జడేజా, సుందర్ పోరాటంతో అతను మళ్లీ బరిలోకి రావాల్సిన పరిస్థితి రాలేదు.
Details
దేశం తరుపున ఆడడం గర్వంగా ఉంది
అయితే, గాయం తీవ్రమవడంతో పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా నారాయణ్ జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవలే ఐదు టెస్టుల సిరీస్‌కు ముగింపు పలకనున్న వేళ, చివరి మ్యాచ్‌కు దూరమవుతున్న రిషబ్ పంత్ జట్టుకు తన సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. "నా జట్టుకి ఓ సందేశం - ఐదో టెస్టును గెలిచి దేశానికి కానుక ఇవ్వాలనే లక్ష్యంతో ఆడాలి. వ్యక్తిగత గోల్స్‌ను పక్కనపెట్టి జట్టు గెలుపు కోసం పాటుపడతా. ఈ సమయంలో సహచరుల మద్దతు పొందడం గర్వంగా ఉంది. దేశం తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. నా భావోద్వేగాలను మాటల్లో వ్యక్తీకరించడం కష్టమని పంత్ తెలిపాడు.