IIFA Digital Awards 2025: ఘనంగా 'ఐఫా' ఓటీటీ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. పింక్ సిటీ జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.
తొలి రోజున బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు హాజరై వేడుకలను సందడి చేశారు.
ఈ అవార్డుల వేడుకలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి పురస్కారాలు నటీనటుల్లో వృత్తిపట్ల మరింత నిబద్ధత పెంచుతాయని పేర్కొన్నారు.
శనివారం రాత్రి జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫా డిజిటల్ అవార్డులను ప్రదానం చేశారు. ఓటిటిలో విశేషంగా ప్రజాదరణ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అవార్డులు అందజేశారు.
ఓటిటి విభాగంలో ఉత్తమ నటిగా కృతి సనన్, ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే విజేతలుగా నిలిచారు.
Details
విన్నర్స్ వీరే
ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకీలా
ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి: కృతి సనన్ (దో పత్తి)
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్)
ఉత్తమ కథ: కనికా ధిల్లాన్(దో పత్తి)
ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్ 3
ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్(పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ నటి: శ్రేయాచౌదరి(బందీశ్ బందిట్స్ సీజన్ 2)
ఉత్తమ దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా(పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్ మాలిక్(పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్(హీరామండి: ది డైమండ్ బజార్)