Loading...
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ.. బాక్సాఫీస్‌ బోసిపోయిందిగా!
ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ.. బాక్సాఫీస్‌ బోసిపోయిందిగా!

Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ.. బాక్సాఫీస్‌ బోసిపోయిందిగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన పాన్‌ ఇండియా సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే రీజనల్‌ సినిమాలు మాత్రం గల్లాపెట్టె వద్ద మంచి వసూళ్లు సాధించగలిగాయి. టాలీవుడ్‌లో 'మన శంకర్‌ వరప్రసాద్‌ గారు' నుంచి 'ఇరుముడి' వరకు, కోలీవుడ్‌లో 'కరుప్పు', 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌', 'డీసీ', మాలీవుడ్‌లో 'వాజా2', 'దృశ్యం3', 'బెత్లెహం కుడుంబ యూనిట్‌' వంటి చిత్రాలు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టుకున్నాయి. అయితే కన్నడ ఇండస్ట్రీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రీజనల్‌ స్థాయిలోనే రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి శాండిల్‌వుడ్‌ సినిమాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.

వివరాలు

గతేడాది శాండిల్‌వుడ్‌ ప్రభంజనం

వాస్తవానికి గత ఏడాది శాండిల్‌వుడ్‌ చూపించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 'కాంతార: చాప్టర్‌ 1' పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యానిమేషన్‌ మైథాలజీ ఫిల్మ్‌ 'మహావతార్‌ నరసింహా' కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది.

ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్ల మార్క్‌ను దాటింది. దీంతో ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి.

ఇక రీజనల్‌ మూవీ 'సు ఫ్రం సో' కూడా ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఇలా గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి విజయాలు దక్కాయి.

వివరాలు

ఈ ఏడాది మాత్రం పూర్తిగా భిన్నంగా..

అయితే ఈ ఏడాది మాత్రం ఎందుకో శాండిల్‌వుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వెనకబడింది. ఏడాది గడిచిపోగా.. ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయినా కన్నడ ఇండస్ట్రీ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా రాలేదు.

అందరి అంచనాలను తల్లకిందులు చేసేసింది పాన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ 'టాక్సిక్‌'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ వాటిని అందుకోలేకపోయింది.

ఇక రీజనల్‌ సినిమాల పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉంది.

ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కన్నడ సినిమా కూడా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కనీసం రూ.50 కోట్ల కలెక్షన్లను కూడా రీచ్‌ కాలేకపోయింది.

ADVERTISEMENT

వివరాలు

స్టార్స్‌ సినిమాలకు దూరం.. బాక్సాఫీస్‌ బోసిపోయిందా?

కన్నడ ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్‌కు దూరంగా ఉండటం ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.

సుదీప్‌, ఉపేంద్ర, రిషబ్‌ వంటి స్టార్స్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద లేకపోవడంతో శాండిల్‌వుడ్‌ గల్లాపెట్టె బోసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

గత ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన చందనసీమకు ఈ ఏడాది మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేకపోయాయి.

మరి రాబోయే మూడు నెలల్లోనైనా శాండిల్‌వుడ్‌ కోలుకుంటుందో లేదో చూడాలి.

ADVERTISEMENT