TheRajaSaab : రెబల్ స్టార్ అభిమానులకు వరుస ట్రీట్స్ కోసం ప్లానింగ్ సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా కోసం రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హార్రర్ ఎంటర్టైనర్‌లో ప్రభాస్ వింటేజ్ స్టైల్లో కనిపించనున్నాడని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని బృందం భావిస్తోంది. అయితే కొంతకాలంగా చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో సినిమా మళ్లీ వాయిదా పడుతుందా అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ మేకర్స్ వాటిని ఖండిస్తూ స్పష్టత ఇచ్చారు. సినిమా ఫస్ట్ కాపీ డిసెంబర్ 25 నాటికి రెడీ అవుతుందని, అలాగే అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నట్టు తెలిపారు.
వివరాలు
న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్గా సినిమా ట్రైలర్ విడుదల
ఇప్పుడు అయితే వరుసగా అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వడానికి టీమ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొదటగా,రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. తమన్ ఇప్పటికే ఒక మాస్ అండ్ మెలోడియస్ ట్రాక్‌ను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను ఈ నెల మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత ప్రతి పది రోజులకు ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే,న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్గా సినిమా ట్రైలర్ విడుదల చేయాలనే ఆలోచనలో మారుతి ఉన్నాడట. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంపాక్ట్ కలిగించే పవర్‌ఫుల్ ట్రైలర్ కట్ సిద్ధం చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తోనే సినిమా పై అంచనాలను మరింత ఉద్ధృతం చేయాలని టీమ్ భావిస్తోంది.
వివరాలు
జనవరి 9న వరల్డ్ వైడ్ విడుదల
క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆపై జనవరి మొదటి వారంలో తెలుగురాష్ట్రాలలో భారీ స్థాయి ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్లాన్ చేస్తుండగా, సినిమా మాత్రం చెప్పినట్టే జనవరి 9న వరల్డ్ వైడ్గా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.