
Mega Family: త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్న మెగా హీరో!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త త్వరలోనే రానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక మిగిలింది హీరో అల్లు శిరీష్ మాత్రమే. 38 ఏళ్లయినా కూడా శిరీష్ ఇంకా బ్యాచిలర్‌గా జీవిస్తుండటంతో, ఆయన వివాహం ఎప్పుడో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, అల్లు శిరీష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఇప్పటికే స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
ఈసారి కూడా అల్లు ఫ్యామిలీలో అదే కమ్యూనిటీకి చెందిన కోడలు రావనున్నారని గాసిప్ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇరు కుటుంబాలు ఈ వివాహానికి అంగీకరించాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో ఊహలు వ్యాపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అల్లు శిరీష్ గాని, అల్లు అరవింద్ గాని ఈ వివాహానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇచ్చేలా లేదు. గతంలో కూడా శిరీష్ వివాహం, రిలేషన్‌షిప్‌లపై పలు రూమర్స్ వచ్చి ఖండించిన సంగతి తెలిసిందే. మరి ఈసారి మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సంబరాలు జరగబోతాయా? అన్నది వేచిచూడాలి.