
Mangalavaaram: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
RX 100 తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) కాంబినేషన్‌లో వచ్చిన 'మంగళవారం' మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ మూవీ నవంబర్ 27న విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిచిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.
మంగళవారం (Manalavaaram) సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఇక ఈ చిత్రం ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కానుంది.
Details
నాలుగు భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంగళవారం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్, ఆమె నటన హైలెట్‌గా నిలిచాయి.
ఇక నందిత శ్వేత, అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలో నటించారు.
నటుడు ప్రియదర్శి మొదటిసారి మంగళవారం సినిమాతో భయపెట్టాడు.
థియోటర్లలో ఈ సినిమా చూడని వారు హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.