
Premalu OTT: ప్రేమలు సినిమా ఓటీటీ రీలీజ్ డేట్ ను ప్రకటించిన యూనిట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల విడుదలై యూత్ ఫుల్ హిట్ ను సాధించిన ప్రేమలు సినిమా ఓటీటీ రీలిజ్ కు సిద్ధమైంది.
ఆహా ఓటీటీ లో ఈ నెల 12న స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
మలయాళం నుంచి తెలుగు హక్కులు తీసుకుని మరీ విడుదల చేయగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.
నెల్సన్, మమిత బైజు నటించిన ఈ సినిమా ఇటీవలే థియేట్రికల్ రన్ ను ముగించకుంది.
గిరీష్ అనే దర్శకుడు తెరకెక్కించి ఈ సినిమా అటు మలయాళం, ఇటు తెలుగు భాష ల్లో కూడా మంచి టాక్ ను సాధించుకుంది.
మలయాళ వెర్షన్ ను హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా..తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
OTT Release date
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో తీసిన కథే...ప్రేమలు
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో మలయాళం లో తీసిన ఈ సినిమా ను తెలుగులో డబ్ చేయగా...ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడు అమెరికా వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో వీసా రిజెక్టు అవుతుంది.
ఖాళీగా ఇంట్లో కూర్చోలేక గేట్ కోసం ప్రిపేర్ అవుదామని హైదరాబాద్ కు వస్తాడు.
ఆ సమయంలో ఓ యువతి పరిచమవుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారుతుంది.
వారి ప్రేమ పరిణయానికి దారి తీసిందా లేదా ? అన్నదే చిత్ర కథ. ఈ మధ్య కాలంలో ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది.