The Odyssey: 'ది ఒడిస్సీ'కి పైరసీ షాక్.. లీకైన ప్రింట్‌ను చూసిన 21 లక్షల మంది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది ఒడిస్సీ' పైరసీ బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు చెందిన హై-క్వాలిటీ ప్రింట్ అక్రమంగా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక 'ఎక్స్'లో పూర్తి నిడివి గల సినిమా వీడియో ప్రత్యక్షమవడంతో నిర్మాతలు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, లీకైన ఈ కాపీని కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 21 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఈ పరిణామాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన నిర్మాణ సంస్థ, కాపీరైట్ చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలను ప్రారంభించింది.
వివరాలు
రూ.6,700 కోట్లు వసూళ్లు..
అదే సమయంలో సోషల్ మీడియా వేదికల నుంచి లీకైన వీడియో లింకులు, వాటిని షేర్ చేసిన పోస్టులు, సంబంధిత ఖాతాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇక భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6,700 కోట్లు) వసూలు చేసే దశకు చేరుకుంది.
వివరాలు
ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ..
భారత్‌లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
విడుదలైన తొలి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ చిత్రం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.147 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
ప్రఖ్యాత గ్రీకు కవి హోమర్ రచించిన 'ది ఒడిస్సీ' అనే ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు.