Loading...
The Odyssey Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ది ఒడిస్సీ'.. 3 రోజుల్లో రూ.2,548 కోట్ల భారీ వసూళ్లు!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ది ఒడిస్సీ'.. 3 రోజుల్లో రూ.2,548 కోట్ల భారీ వసూళ్లు!

The Odyssey Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ది ఒడిస్సీ'.. 3 రోజుల్లో రూ.2,548 కోట్ల భారీ వసూళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హాలీవుడ్ విజువల్ ఎపిక్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్టార్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మ్యాట్ డామన్ ప్రధాన పాత్ర పోషించారు. విడుదలైన తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో సుమారు రూ.2,548 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. నోలన్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలవడం విశేషం.

వివరాలు

భారత్‌లోనూ అదిరిపోయిన ఆరంభం

'ది ఒడిస్సీ' భారత బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. తొలి రోజే రూ.20.76 కోట్ల వసూళ్లు సాధించి ఆకట్టుకుంది.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 39.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) రాబట్టి తన సత్తా చాటింది.

ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 264 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే 124 మిలియన్ డాలర్లు రావడం విశేషం.

ఈ భారీ వసూళ్లతో క్రిస్టఫర్ నోలన్ గత చిత్రాలైన 'ది డార్క్ నైట్ రైజెస్' (249 మిలియన్ డాలర్లు), 'ఒప్పెన్‌హైమర్' (181 మిలియన్ డాలర్లు) తొలి వీకెండ్ కలెక్షన్లను 'ది ఒడిస్సీ' అధిగమించింది.

వివరాలు

హోమర్ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన విజువల్ ఎపిక్

ప్రపంచ ప్రఖ్యాత కవి హోమర్ రచించిన క్లాసిక్ ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ చిత్రాన్ని క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు.

దాదాపు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 91 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం.

త్వరలోనే వన్ బిలియన్ క్లబ్‌లోకి?

విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన 'ది ఒడిస్సీ' ఇదే జోరు కొనసాగిస్తే మరికొన్ని రోజుల్లో 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుత స్పందనను బట్టి ఈ చిత్రం నోలన్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT